100 ప‌డ‌క‌ల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో న‌టి జాక్వెలిన్ బిజీ

న్యూఢిల్లీ : కరోనా వైర‌స్ సోకిన రోగుల‌కు అందుబాటులో ఉండేలా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 100 పడకల కొవిడ్‌-19 సంర‌క్ష‌ణ‌కేంద్రం ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ఈ కేంద్రంలో 500 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు కూడా అందుబాటులో ఉంచ‌నున్నారు.

బాలీవుడ్‌లో వెలుగొందుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి నటులతో కలిసి పనిచేసి విజ‌యాల‌ను అందుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె సల్మాన్ ఖాన్ సరసన కిక్ 2 చిత్రంలో కనిపించనున్న‌ది.

ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కరోనా మహమ్మారిలో ప్రజలకు సహాయం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. త్వ‌ర‌లోనే కొవిడ్ -19 సంర‌క్ష‌ణ కేంద్రాన్ని తెరుస్తున్న‌ట్లు ఇటీవల ఆమె వెల్లడించారు. 100 పడకలు, 500 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్ల‌తో కేంద్రాన‌ని తెరుస్తామ‌ని, అలాగే 2 అంబులెన్స్‌లను కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతామ‌ని చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ స‌మ‌యంలో అంబులెన్స్ సేవ చాలా ఖరీదైనద‌నందున పేద‌ ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ సదుపాయాన్ని కల్పిస్తామని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలిపారు.

ఇటీవలే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కరోనా మహమ్మారి రోగులు, వారి స‌హాయ‌కుల‌కు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఆమె ఒక ఎన్జీఓతో వంటగదిని నడిపిస్తున్న‌ది. ఇటీవల అక్షయ్ కుమార్, ట్వింకిల్‌ ఖన్నా 100 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్ల‌ను అందించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చైనాలో తుఫాను : ఏడుగురు మృతి

టీకాలు తీసుకున్నా.. మాస్క్‌లు మ‌రువొద్దు : డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా

ఆధునిక హంగుల‌తో రాజ‌ధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్

“మీ ప్రియమైన వారి చేయి వ‌ద‌ల‌కండి”: టీనా అంబానీ సందేశం

తెర‌పైకొచ్చిన మిక్కీ మౌస్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

అక్క‌డ మ‌సీదులు మాయ‌మ‌య్యాయి.. ఎందుకంటే..?

ఉద‌యం చురుకైన న‌డ‌క‌తో క‌రోనాకు చెక్‌..!

నేను చ‌నిపోతే ఎవ‌రెవ‌రు వ‌స్తారో చూస్తా..! ఓ మ‌హిళ డెత్ రిహార్స‌ల్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..