US | ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు భారీ నష్టం.. సాయమందించనున్న అమెరికా.. ప్లాన్స్ ఇవే
US : అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్‌పై దాడి చేస్తే.. ఇరాన్.. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఇవి మిత్రదేశాలు. నిజానికి ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలకు నేరుగా సంబంధం లేదు.
US : అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్‌పై దాడి చేస్తే.. ఇరాన్.. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఇవి మిత్రదేశాలు. నిజానికి ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలకు నేరుగా సంబంధం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ యుద్దం జరుగుతోంది. అమెరికాకు సైనికపరంగా ఆశ్రయం ఇవ్వడమే గల్ఫ్ దేశాలకు శాపంగా మారింది.
భారీగా నష్టపోయాయి. విమానాశ్రయాలు, చమురు ఉత్పత్తి కేంద్రాలు వంటివి నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా.. తన మిత్ర దేశాలకు తన వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు సిధ్ధమైంది. ఈ మేరకు అమెరికా ట్రెజర్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కూడా ఇరాన్ ఆస్తుల్ని వినియోగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ యుద్దం కారణంగా ఆయా దేశాలకు కలిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఇరాన్ చమురు ట్యాంకర్లు, ఇరాన్ నుంచి సీజ్ చేసిన ఆస్తుల్ని వినియోగించి గల్ఫ్ దేశాలకు సాయం అందిస్తాయా అనేది చూడాలి.
ఇరాన్‌కు చెందిన సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుల్ని, ఇతర ఆస్తుల్ని వాడుకుని గల్ఫ దేశాలకు నిధులు సమకూర్చాలని అమెరికా భావిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడి చేస్తోంది. ప్రతిగా అమెరికా కూడా ఇరాన్‌పై దాడి చేస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా ఇరు దేశాలు దాడి చేసుకుంటున్నాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే చర్చలు ముగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- Gulf
- Iran war
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

