e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home General తెర‌పైకొచ్చిన మిక్కీ మౌస్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

తెర‌పైకొచ్చిన మిక్కీ మౌస్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

తెర‌పైకొచ్చిన మిక్కీ మౌస్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

చిన్నారుల అభిమాన కార్టూన్ పాత్ర అయిన మిక్కీ మౌస్ 1928 లో స‌రిగ్గా ఇదే రోజున‌ మొదటిసారి తెరపైకి వచ్చింది. మొదటి చిత్రం ‘ప్లెయిన్ క్రేజీస్‌ ‘లో మిక్కీ మౌస్‌ను ప్ర‌ద‌ర్శించారు. 6 నిమిషాల నిడివి గ‌ల‌ ఈ చిత్రంలో మిక్కీ, ఇతర పాత్రలు విమాన ప్ర‌యాణం చేయడానికి ప్రయత్నిస్తాయి. మిక్కీతో పాటు మినీ పాత్ర కూడా ఈ చిత్రం నుంచి మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదే సంవత్సరంలో డిస్నీ సంస్థ‌ ‘గలోపిన్ గౌచో’ అనే మరో చిత్రాన్ని కూడా ప్రదర్శించింది. ఈ రెండు సినిమాలు మూకీ సినిమాలు. ఆ త‌ర్వాత అక్టోబర్ 1 న డిస్నీ ‘స్టీమ్‌బోట్ విల్లీ’ అనే చిత్రాన్ని రూపొందించి సౌండ్ ఎఫెక్ట్స్‌తో విడుద‌ల చేశారు. ఈ సినిమా చాలా ప్రసిద్ది చెందింది. ఇక డిస్నీ వెన‌క్కి తిరిగి చూసుకోకుండా వేల డాల‌ర్లు సంపాదిస్తూనే ఉన్న‌ది. అక్టోబ‌ర్ 1 న సినిమా రిలీజ్ అయినందున అదే రోజును మిక్కీ మౌస్ పుట్టిన‌రోజుగా జ‌రుపుతారు.

ఒక రోజు వాల్ట్ డిస్నీ తన డెస్క్ వద్ద కూర్చున్న స‌మ‌యంలో అతను ఒక ఎలుకను చూశాడు. వెంట‌నే ఎలుక బొమ్మ‌ను గీసిన డిస్నీ.. ఆ ఎలుక‌కు గ‌మ్మ‌త్తైన చెవులు, ముక్కును అద్దాడు. చేతుల‌కు గ్లౌజ్‌లు, కాళ్ల‌కు పెద్ద బూట్ల‌, దుస్తులు కూడా ధరింప‌జేసి మోర్టిమోర్ అని పేరు పెట్టారు. అయితే ఈ పేరు డిస్నీ భార్య‌కు న‌చ్చ‌లేదు. మ‌రో రోజు ఆలోచించి చివ‌ర‌కు మిక్కీ అని నామ‌క‌ర‌ణం చేశారు.

మిక్కీ మౌస్‌ మాట్లాడిన మొదటి కార్టూన్‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఈ విజయం తర్వాత వాల్ట్ డిస్నీ.. మిక్కీ మౌస్ క్లబ్, పిల్ల‌ల‌ కోసం ఫ్యాన్ క్లబ్ అనే రెండు సంస్థలను ప్రారంభించాడు. అనంత‌ర కాలంలో గూఫీ, ప్లూటో, డోనాల్డ్ డక్ కూడా వచ్చాయి.

ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్లలో డిస్నీ ఒకటి

మిక్కీ మౌస్ పేరుతో ఇప్పటివరకు 22 లఘు చిత్రాలు, 11 సినిమాలు, 6 కార్టూన్ సిరీస్‌లు విడుదలయ్యాయి. 2020 లో వాల్ట్ డిస్నీప్రపంచ ఆదాయం 38.7 బిలియన్ డాల‌ర్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ల‌లో డిస్నీ 7 వ స్థానంలో ఉన్న‌ది. ఫోర్బ్స్ ప్రకారం, దాని బ్రాండ్ విలువ 61.3 బిలియన్ డాల‌ర్లు. డిస్నీ మీడియా బిజినెస్ నెట్‌వర్క్‌లో డిస్నీ ఛానల్, ఈఎస్‌పీఎన్, హిస్టరీ, లైఫ్‌టైమ్ వంటి అనేక ఛానెల్‌లు ఉన్నాయి. డిస్నీ హాట్ స్టార్ 8 మిలియన్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న‌ది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

నేడు అంత‌ర్జాతీయ కుటుంబ దినోత్స‌వం

2018: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిలో పడవ మునిగి 40 మంది దుర్మ‌ర‌ణం

2018 : వార‌ణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్ కూలి 18 మంది దుర్మ‌ర‌ణం

2013: చిత్రకారుడు గెర్హార్డ్ రిక్టర్ గీసిన‌ చిత్రలేఖనం 37.1 మిలియన్ డాల‌ర్ల‌కు వేలంలో సొంతం చేసుకున్న ఓ అభిమాని

2011: రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ మరణం

2008: భారత సంతతికి చెందిన మంజులా సూద్ బ్రిటన్‌ మేయర్‌గా ఎన్నికైన‌ తొలి ఆసియా మహిళగా రికార్డు

1993 : భార‌త ఆర్మీ తొలి క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ మార్ష‌ల్ కేఎం క‌రియ‌ప్ప మ‌ర‌ణం

1957 : థ‌ర్మో న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ క‌లిగి ఉన్న మూడో దేశంగా బ్రిట‌న్ అవ‌త‌ర‌ణ‌

1948: స్వాతంత్ర్య ప్ర‌క‌టించుకున్న మ‌ర‌స‌టి రోజే ఇజ్రాయెల్‌పై దాడికి పాల్ప‌డిన అర‌బ్ దేశాలు

1940: కాలిఫోర్నియాలో మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ ప్రారంభం

1923: భారత హాస్యనటుడు జానీ వాకర్ జన‌నం

1859: నోబెల్ గ్ర‌హీత‌, రేడియంను క‌నిపెట్టిన శాస్త్ర‌వేత్త పియరీ క్యూరీ జననం

ఇవి కూడా చ‌ద‌వండి..

అక్క‌డ మ‌సీదులు మాయ‌మ‌య్యాయి.. ఎందుకంటే..?

గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ ‘స్టార్‌లింక్’

ఉద‌యం చురుకైన న‌డ‌క‌తో క‌రోనాకు చెక్‌..!

క‌రోనాతో విల‌విల‌.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?

నేను చ‌నిపోతే ఎవ‌రెవ‌రు వ‌స్తారో చూస్తా..! ఓ మ‌హిళ డెత్ రిహార్స‌ల్‌

టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్‌పాట్‌ గెలుచుకోండి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెర‌పైకొచ్చిన మిక్కీ మౌస్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement