e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ 'స్టార్‌లింక్'

గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ ‘స్టార్‌లింక్’

గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ 'స్టార్‌లింక్'

గూగుల్‌తో స్పేస్‌ఎక్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ఎలోన్ మ‌స్క్ జ‌త‌క‌ట్టారు. వీరి క‌ల‌యిక‌తో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవ‌కాశాలు ఉన్నాయి. రానున్న కొన్ని రోజుల్లో భార‌త్‌లో రిల‌య‌న్స్ సంస్థ‌కు ప్ర‌ధాన పోటీదారుగా అవ‌త‌రిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.

ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్‌ఎక్స్.. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు. స్టార్‌లింక్ ఫిబ్రవరిలోనే భారతదేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ‘స్టార్‌లింక్’ కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభించింది. ఇప్పుడు ఈ పనిచేయడానికి గూగుల్‌తో చేయి క‌లిపింది. ఈ భాగ‌స్వామ్యం ఎలోన్ మ‌స్క్ పనుల‌ను వేగవంతం చేస్తుందన‌డంలో ఎలాంటి ఔచిత్యం లేదు. స్టార్‌లింక్ ప్రపంచంలోని ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభం చేస్తుంది. ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్‌లో 10,000 మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారని కంపెనీ పేర్కొన్న‌ది.

గూగుల్ అధిక సామర్థ్యం గల ప్రైవేట్ నెట్‌వర్క్ స్టార్‌లింక్ గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల‌కు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా వినియోగ‌దారులు ఎలాంటి అంతరాయం లేకుండా అధిక వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. గూగుల్ క్లౌడ్ కక్ష్యలో 1500 స్టార్‌లింక్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

భూమికి దగ్గరగా ఉన్న‌ది ఇదొక్క‌టే

క‌రోనా నేప‌థ్యంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేస్తుండ‌టం, విద్యార్థులు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో ఇంట‌ర్నెట్ స్పీడ్ చాలా ప్రాముఖ్య‌త సంత‌రించుకున్న‌ది. ఎవ‌రు నాణ్య‌త గ‌ల సేవ‌లందిస్తే వారి సంస్థ‌కు వినియోగ‌దారులు మారుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో స్టార్‌లింక్ ఉపగ్రహం ఇతర ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉన్న‌దని, ఫ‌లితంగా అన్నిటిక‌న్నా ఎక్కువ వేగంతో ఇంట‌ర్నెట్ అందుతుంద‌ని స్పేస్‌ఎక్స్ సోషల్ మీడియాలో రాసింది.

ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రీ బుకింగ్

స్టార్‌లింక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, స్టార్లింక్ ఇంటర్నెట్ 2022 సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభమవుతుంది. వ‌చ్చే ఫిబ్రవరి నుంచి భారతదేశంలో ప్రీ-బుకింగ్ మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం సేవా పరీక్షలు న‌డుస్తున్నాయి. ముందస్తు ఆర్డర్ సమయంలో ఈ సేవ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కవర్ చేస్తుంది.

స్టార్‌లింక్ ప్రాజెక్టు కోసం స్పేస్‌ఎక్స్ ఇప్పటికే వెయ్యికి పైగా ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రస్తుతం స్టార్లింక్ 50–150 ఎంబీపీఎస్‌ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1 జీబీపీఎస్ వరకు వేగవంతం చేయడానికి భవిష్యత్‌లో 12 వేల ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఎలోన్ మస్క్ చెప్పారు. స్టార్‌లింక్ సేవ‌లు ఉన్న‌తంగా ఉన్న‌ట్ల‌యితే రానున్న కొన్ని రోజుల్లోనే రిల‌య‌న్స్‌కు ముప్పు త‌ప్ప‌దంటున్నారు నిపుణులు. రిల‌య‌న్స్‌కు ఇప్పుడు 65 మిలియ‌న్ల వినియోగ‌దారులు ఉన్నారు. వీరి సేవ‌లు గ్రామీణ ప్రాంతాల్లో చాలా అధ్వాన్నంగా ఉండ‌టంతో ఎలోన్ మ‌స్క్ సంస్థ పైచేయి సాధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఉద‌యం చురుకైన న‌డ‌క‌తో క‌రోనాకు చెక్‌..!

క‌రోనాతో విల‌విల‌.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?

నేను చ‌నిపోతే ఎవ‌రెవ‌రు వ‌స్తారో చూస్తా..! ఓ మ‌హిళ డెత్ రిహార్స‌ల్‌

టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్‌పాట్‌ గెలుచుకోండి

స్వ‌తంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్ర‌లో ఈరోజు

దంతాలు బ్రేక్‌ఫాస్ట్ క‌న్నా ముందే శుభ్ర‌ప‌రుచుకోవాలా..?

1100 ఏండ్ల నాటి ప‌ద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!

సిద్ధ‌మైన 2-డీజీ ఔష‌ధం.. మొద‌ట ఇచ్చేది ఎక్క‌డో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ 'స్టార్‌లింక్'

ట్రెండింగ్‌

Advertisement