వైరా, మే 28 : పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ఓ చెట్టుకు అంటుకొని అది టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏలూరు శ్రీనివాసరావు, అతని కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కారులో వైరా నుంచి మధిర వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో రెబ్బవరం గ్రామ సమీపంలోకి కారు చేరుకోగా రైతులు పంట పొలా ల్లోని వ్యర్థాలకు పెట్టిన నిప్పు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు అంటుకొని శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, అతడి భార్య, తల్లిదండ్రులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.