గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గో (స్కాట్లాండ్) వెళ్లిన వారిలో ఆరుగురు ఆటగాళ్లు గేమ్స్ ముగిశాక అక్కడే అదృశ్యమవడం చర్చనీయాంశమైంది. క్రీడల హంగామా ముగిసి క్రీడాకారులంతా తమ స్వదేశాలకు చేరుకోగా ఉగాండాకు చెందిన నలుగురు, పాకిస్థాన్ నుంచి ఇద్దరు (మరొకరి వివరాలు తెలియరాలేదు) వారి స్వదేశానికి రాకుండా మిస్ అయ్యారు. దీనిపై ప్రస్తుతం స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అదృశ్యమైన ఆరుగురు ఆటగాళ్ల ఆచూకీ కనుక్కునే పనిలో పడ్డారు.