కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి విధేయుడైన ఆమె వర్గం ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై దాడి జరిగింది. మమతా ప్రసంగించే సభకు వెళ్తున్న ఆయన వాహనాన్ని మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనుక అద్దం ధ్వంసమైంది. (Kunal Ghosh’s car attacked) శనివారం హూగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మమతా బెనర్జీ వర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే కునాల్ ఘోష్, ఆమె ప్రసంగించనున్న సభలో పాల్గొనేందుకు సెరంపూర్కు కారులో బయలుదేరారు. ఉత్తరపారా ప్రాంతంలో నల్ల జెండాలు పట్టుకున్న ఒక గుంపు ఆయన వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. రాళ్లు, గుడ్లతో కారుపై దాడి చేశారు. కునాల్ ఘోష్ వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. ఈ దాడిలో ఆయన కారు వెనుక అద్దం ధ్వంసమైంది.
కాగా, ఈ సంఘటన తర్వాత ఎమ్మెల్యే కునాల్ ఘోష్, కోల్‌కతాకు తిరుగు ప్రయాణమయ్యారు. తన వాహనంపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌ను లోపలకు అనుమతించలేదని ఆ పార్గీ వర్గాలు ఆరోపించాయి. టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Breaking: #TMC leader Kunal Ghosh’s vehicle attacked in Uttarpara while he was on his way to Sreerampur where Mamata Banerjee is scheduled to address a public meeting today. Eggs hurled, stones pelted & vehicle damaged. pic.twitter.com/MfqhTogXvO
— Pooja Mehta (@pooja_news) September 26, 2026