Rana Daggubati | కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘డోరతీ’ (Dorothy). ఆస్కార్ అవార్డు విజేత గునీత్ మోంగా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించగా, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగులోకి రాబోతుంది.
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో సమాజంలోని పక్షపాతాలు, లింగ సమానత్వం, LGBTQIA+ మరియు జెండర్ రాజకీయాల చుట్టూ తిరిగే విభిన్నమైన, ధైర్యమైన కథాంశాన్ని కార్తీక్ సుబ్బరాజు ఆవిష్కరించారు. టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం.