కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులు మారాయి. ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ యాంకర్ స్పోర్ట్స్.. జాఫ్నా ఫ్రాంచైజీ హక్కులను దక్కించుకోగా భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఇందులో సహ యజమానిగా చేరాడు. ఎల్పీఎల్ తాజా సీజన్ ఆరంభానికి ముందు ఈ టీమ్‌కు కో-ఓనర్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ మనోజ్.. పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడాలని పురిగొల్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక జాఫ్నా పాత యాజమాన్యం దివాళా తీయడంతో టోర్నీ నిర్వాహకులు వారిపై వేటు వేశారు. యాంకర్ గ్రూప్ చేరడంతో ఈ టీమ్‌కు ‘యాంకర్ జాఫ్నా కింగ్స్’గా పేరు మార్చారు. ఈ జట్టుకు సహ యజమానిగా చేరడంపై జహీర్ సంతోషం వ్యక్తం చేశాడు.