– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 28 : గ్రామాభివృద్ధికి ప్రజలు అన్నివిధాలుగా సహకరించాలని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో జరిగే పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పంచాయతీ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషిచేస్తామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 86 మంది విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తులను ఎంఈవో యదుసింహరాజుతో కలిసి సర్పంచ్ పంపిణీ చేశారు. జల స్వచ్ఛతా దినం సందర్భంగా నీటి వనరులు, బోర్లు, ట్యాంకుల వద్ద శుభ్రత చర్యలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రవి, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.