Festive season | ముందన్నీ పండుగలు.. ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు..!
Festive season | ఈసారి పండగ సీజన్ (Festive Season) ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగులబోతున్నది. ఏసీలు (ACs), మొబైల్ ఫోన్లు (Mobile Phones), ఎల్ఈడీ టీవీలు (LED TVs), వాషింగ్ మెషీన్లు (Washing Mechines), రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్స్ ధరలు అక్టోబర్ 1 నుంచి పెరుగబోతున్నాయి. ప్రముఖ కంపెనీలు (Noted Companies) తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి.
Festive season : ఈసారి పండగ సీజన్ (Festive Season) ప్రారంభానికి ముందే వినియోగదారులకు షాక్ తగులబోతున్నది. ఏసీలు (ACs), మొబైల్ ఫోన్లు (Mobile Phones), ఎల్ఈడీ టీవీలు (LED TVs), వాషింగ్ మెషీన్లు (Washing Mechines), రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్స్ ధరలు అక్టోబర్ 1 నుంచి పెరుగబోతున్నాయి. ప్రముఖ కంపెనీలు (Noted Companies) తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనించవలసిన విషయం.
అల్యూమినియం, రాగి, ఉక్కు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కరెన్సీ మారకం విలువలో వస్తున్న హెచ్చుతగ్గులు ఈ పెంపునకు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏసీల ధరలు 5 నుంచి 8 శాతం మేర పెరగనుండగా.. టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు 3-4 శాతం వరకు పెరగనున్నాయి. బ్లూస్టార్, గోద్రెజ్, హయర్, దైకిన్ వంటి సంస్థలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి.
ఎల్జీ, వోల్టాస్, హిటాచి బ్రాండ్ ఏసీలను విక్రయించే బాష్ హోమ్ కంఫర్ట్ కూడా సుమారు 5 శాతం ధరలను పెంచినట్లు తెలుస్తున్నది. ముడిసరుకుల ధరల పెరుగుదలవల్లే ధరలు పెంచక తప్పడం లేదని బ్లూస్టార్ ఎండీ బి త్యాగరాజన్ అన్నారు. రాగి ధర గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని, అందుకే ఏసీల ధరలను 5 శాతం పెంచుతున్నామని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ చెప్పారు. అయితే డీలర్ల దగ్గర పాత స్టాక్ ఒకటి, ఒకటిన్నర నెలలపాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందని, కాబట్టి దీపావళి వరకు వినియోగదారులకు పాత ధరలకే ఉత్పత్తులు లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీపావళి తర్వాత కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

