ముంబై, ఆగస్టు 5 : విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) రంగం.. 2030నాటికి 3-4 కోట్ల ఉద్యోగాలను సృష్టించే వీలున్నదని, ఏటా ఈ రంగంలో నియామకాలు 15-20 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని ఓ తాజా రిపోర్టు అంచనా వేసింది. ఇంజినీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీలలో నిపుణులైన ప్రతిభావంతులకు డిమాండ్ బాగా ఉన్నదని బుధవారం విడుదలైన ఈ నివేదిక చెప్పింది.
దేశంలో టూవీలర్, ప్యాసింజర్ వాహన వినియోగదారులు ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం, తేలికపాటి వాణిజ్య వాహనాలతోపాటు ప్రజా రవాణా వ్యవస్థల్లోనూ ఈవీలకు ఆదరణ పెరుగుతుండటం.. ప్రత్యక్షంగా 15 శాతం, పరోక్షంగా 85 శాతం వరకు ఉద్యోగావకాశాలను పెంచుతున్నదని అడెకో ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొన్నది.