Pawan Kalyan | తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల విమర్శలు!
TTD Ghee of Animal Fat | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్ర శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత వివాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
TTD Ghee of Animal Fat | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్ర శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత వివాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంయుక్తంగా జరిపిన సమగ్ర దర్యాప్తులో టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు (Animal Fat) వాడినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. అయితే, ఈ విచారణలో నెయ్యి సరఫరాలో కొంత కల్తీ జరిగినట్లు మాత్రం అధికారులు నిర్ధారించారు. పంపిణీ చేసిన నెయ్యిలో కొద్దిపాటి రసాయనాలు (Chemicals) మరియు వృక్ష ఆధారిత పదార్థాలు (Vegetable Oils) వంటి కల్తీ పదార్ధాలు కలిపినట్లు దర్యాప్తు నివేదికలో వెల్లడైంది.
ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు చేసిన తీవ్ర ఆరోపణలు అవాస్తవమని తేలడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో వారిపై విమర్శల వర్షం కురుస్తోంది. సిట్ (SIT) దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవ్వడంతో, కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు, ప్రత్యర్థులపై బురదజల్లే దురుద్దేశంతోనే అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పవిత్రతతో చెలగాటమాడి, కోట్లాది మంది హిందూ భక్తుల విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారంటూ నెటిజన్లు, సామాజిక వేత్తలు పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతల తీరును తప్పుపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

