Kim Jong-un | మనం అత్యంత విధ్వంసకర శక్తిగా మారాలి.. సైన్యానికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశం..!
Kim Jong-un | ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) తమ దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ఆదేశాలు జారీచేశారు. తమ ఫిరంగి దళాలు (ఆర్టిలరీ) అత్యంత కేంద్రీకృత, విధ్వంసకర సామర్థ్యాలను కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Kim Jong-un : ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) తమ దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ఆదేశాలు జారీచేశారు. తమ ఫిరంగి దళాలు (ఆర్టిలరీ) అత్యంత కేంద్రీకృత, విధ్వంసకర సామర్థ్యాలను కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వారంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన పలు కీలక ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. ఈ పర్యటన వివరాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా (Media) వెల్లడించింది.
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ)’ కథనం ప్రకారం.. రూలింగ్ వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ పాక్ జోంగ్ చోన్తో సహా పలువురు ఉన్నతాధికారులు కిమ్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. “యుద్ధాన్ని నిరోధించడం, యుద్ధంలో పోరాడటం అనే రెండు కీలక బాధ్యతలను మన ఆర్టిలరీ సమర్థంగా నిర్వర్తించాలి. దీని కోసం అత్యంత విధ్వంసకర, బహుముఖ దాడి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి” అని స్పష్టంచేశారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మించాలనే పార్టీ వ్యూహాత్మక విధానంలో ఆయుధ పరిశ్రమ కీలకపాత్ర పోషించాలని కిమ్ ఉద్ఘాటించారు. దాడి, రక్షణ ఆయుధాలలో కృత్రిమ మేథ (ఏఐ) స్థాయిని పెంచడం, ఫిరంగి ఆయుధాల ఆటోమేషన్, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి విధానపరమైన పనులను ఆయన నిర్దేశించారు. కిమ్ 600 ఎంఎం, 240 ఎంఎం మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, డ్రోన్లను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలను సందర్శించి ఉండవచ్చని సియోల్‌కు చెందిన కొరియా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోరమ్ సెక్రటరీ జనరల్ షిన్ జోంగ్-వూ విశ్లేషించారు.
కాగా దక్షిణకొరియా, అమెరికా, జపాన్ దేశాలు ఇటీవల నిర్వహించిన త్రైపాక్షిక సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా సెప్టెంబర్ 14న ఉత్తర కొరియా క్షిపణి, ఫిరంగి దళాలతో భారీ ఫైర్‌పవర్ విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసంలో కొత్త రకం అటాక్ డ్రోన్లు, టాక్టికల్ క్రూయిజ్ క్షిపణులు, భారీ కాలిబర్ రాకెట్ లాంచర్లు, టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ ఆయుధాలన్నీ తమ లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో ఛేదించాయని ఉత్తర కొరియా ప్రకటించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

