శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.
మృతులను ఎస్టీ (లంబాడ) సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కేతావత్ లింబ్య(54), కేతావత్ జమున (45), కత్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వాస్రం(45)గా గుర్తించారు. వీరంతా తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డతండా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌నే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

