Podusthunna Poddu Meeda | నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దుమీద’?
Nani's The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ మూవీ 'ది ప్యారడైజ్'.
Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా మ్యూజికల్ ఫీస్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న పాటల జాబితా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ గీతంగా కోట్లాది మంది ప్రజల హృదయాలను హత్తుకున్న ప్రసిద్ధ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అమూల్యమైన గీతం ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా…’ పాటను ఈ సినిమాలో ఉపయోగిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలతో పాటు ఈ ఐకానిక్ ఫోక్ సాంగ్ కూడా సినిమాలో చోటు చేసుకుంటే, థియేటర్లలో ప్రేక్షకుల ఊపు చూసి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. అనిరుధ్ మ్యూజిక్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని మాస్ పెర్ఫార్మెన్స్కు తోడు ఈ ఫోక్ సాంగ్ తాలుక వైబ్స్ తోడైతే సిల్వర్ స్క్రీన్ మీద రికార్డులు తిరగరాయడం పక్కా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చిత్రయూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇవి కేవలం రుమర్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
If it is true Telangana theatres are going to erupt “Podusthunna Poddu Meeda”! 🥵💥#Nani #TheParadise #TheParadiseWillRiseFromSept24 pic.twitter.com/rcSxFrHRJc
— Rebel Freak (@rebelfreak0298) September 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

