Gold Prices | రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ ధర రూ.1.50 లక్షల పైకి చేరుకున్నది. వరుసగా రెండోరోజూ బుధవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.7 శాతం ఎగబాకి రూ.1.50 లక్షలుగా నమోదైంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 5 : బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ ధర రూ.1.50 లక్షల పైకి చేరుకున్నది. వరుసగా రెండోరోజూ బుధవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.7 శాతం ఎగబాకి రూ.1.50 లక్షలుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,47,500గా ఉన్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. జూలై 6న నమోదైన రూ.1,50,650 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. బంగారంతోపాటు వెండి ధరలు పరుగులు పెట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.6,200 ఎగబాకి రూ.2,32,700కి చేరుకున్నది.
దీంతో వెండి ధరలు నెల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు అయింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేదానిపై అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, ఫెడరల్ రిజర్వు ద్రవ్య కఠినతరం అవుతుందనే అంచనాలు నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 85.28 డాలర్లు లేదా 2.09 శాతం ఎగబాకి 4,162.76 డాలర్లకు చేరుకోగా, వెండి మూడు శాతం బలపడి 61.35 డాలర్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

