దుమ్ముగూడెం, సెప్టెంబరు 18 : దుమ్ముగూడెం మండలం చినబండిరేవు గ్రామ సర్పంచ్ జోగయ్య ఇటీవల పాము కాటుకు గురయ్యాడు. చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి పృద్వీ శుక్రవారం సర్పంచ్ నివాసానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఆయన వెంట భద్రయ్య, తంతరపల్లి వెంకటేశ్వర్లు, మంగయ్య తదితరులు ఉన్నారు.