బూర్గంపహాడ్, సెప్టెంబర్ 18 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ నిధులు రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను జిల్లా పంచాయతీ అధికారిణి(డీపీవో) అనూష శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో వివిధ శుభకార్యాలు, సమావేశాలకు ఫంక్షన్‌హాల్ భవన నిర్మాణం జరుగుతుందని, ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి భవనాన్ని అందుబాటులోకి తేవాలని గుత్తేదారు రవికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సరోజ, ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.