Asian Games | తొలిరోజే భారత బృందానికి సమస్యల స్వాగతం.. బస్సుల్లేక వీధుల్లో షూటర్లు..!
Asian Games : ఆసియా క్రీడల్లో అథ్లెట్లకు మెరుగైన వసతులు లేకపోవడం తీవ్ర సమస్యగా మారుతోంది. సర్దుకుపోదాంలే అనుకుంటూ నగోయలో అడుపెట్టిన క్రీడాకారులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసియాడ్‌లో పతకాల వేటకు వెళ్లిన భారత షూటర్ల(Indian Shooters)కు కష్టాలు స్వాగతం పలికాయి.
Asian Games : ఆసియా క్రీడల్లో అథ్లెట్లకు మెరుగైన వసతులు లేకపోవడం తీవ్ర సమస్యగా మారుతోంది. సర్దుకుపోదాంలే అనుకుంటూ నగోయలో అడుపెట్టిన క్రీడాకారులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసియాడ్‌లో పతకాల వేటకు వెళ్లిన భారత షూటర్ల (Indian Shooters)కు కష్టాలు స్వాగతం పలికాయి. జపాన్‌లో కాలుమోపిన రోజే రవాణా సౌకర్యం ఆలస్యం కారణంగా వీధుల్లో నిరీక్షించారు మన షూటర్లు. అంతేకాదు వసతుల కొరత, శిక్షణకు అంతరాయం వంటివి భారత బృందానికి సవాల్ విసురుతున్నాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.
పద్దెనిమిదో ఆసియా క్రీడల కోసం భారత షూటర్ల బృందం సెప్టెంబర్ 15న జపాన్ వెళ్లింది. రాత్రి 11 గంటలకు కస్టమ్స్ అనుమతి లభించగా.. అక్రెడిటేషన్ నిర్ధరణ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడపదిహేను నిమిషలు పట్టగా.. ఇక బస్సు రావడం ఆసియా క్రీడల నగరం నగోయకు వెళ్లడమే తరువాయి అనుకున్నారంతా. కానీ, ఆశ్చర్యంగా.. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఒలింపిక్ విజేత మనూ భాకర్ (Manu Bhaker), కామన్వెల్త్లో మెరిసిన ఇషా సింగ్‌లతో కూడిన 35 మంది భారత షూటర్ల బృందం వీధుల్లోనే నిరీక్షించింది. రాత్రి 11:45 గంటల నుంచి మరునాడు ఉదయం 3 గంటల వరకూ అక్కడే వేచి చూసిన షూటర్లు.. ఎట్టకేలకు మూడు తర్వాత తమకు కేటాయించిన హోటల్ చేరారు.
Severe logistical chaos has overshadowed the arrival of international contingents, including hundreds of Indian athletes, in Nagoya, Japan, just days before the official opening of the 2026 Asian Games. pic.twitter.com/AdzwBySRE3
— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) September 18, 2026
‘హమ్మయ్య ఎలాగోలా వచ్చేశాం’ అనుకొనే లోపే అక్కడ అంత మందికి ఏడు గదులే ఇవ్వడం చూసి షాకయ్యారు. ఈ విషయం తెలిసిన భారత ఒలింపిక్ సంఘం వెంటనే స్పందించింది. షూటర్ల సౌకర్యార్థం అక్కడికి 400 మీటర్ల దూరంలో 18 గదులు బుక్ చేసింది ఐఓఏ. ఈ సమస్య పరిష్కారం అయిందని సంతోషించిన భారత షూటర్లకు శిక్షణ కేంద్రానికి వెళ్లడంలో ఆటంకం ఏర్పడింది. ఉదయం 7 గంటలకు బస్సు ఎక్కి.. 8:20 గంటలకు ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లాలి.
కానీ, ఒకటే బస్సు ఏర్పాటు చేయడంతో అందరూ ఒకేసారి వెళ్లలేకపోయారు. తదుపరి బస్సు వచ్చేంత వరకూ కోచ్‌లు, కొందరు షూటర్లు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉన్నారు. ఇలా.. నగోయలో వసతి సౌలభ్యం నుంచి.. సాధన చేసేందుకు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇదెక్కడి ఆతిథ్యం అని తల పట్టుకుంటున్నారు క్రీడాకారులు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

