‘భద్రాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం చుంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కళావతికి...
– చుంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట న్యూడెమోక్రసీ ధర్నా
చుంచుపల్లి, సెప్టెంబర్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం చుంచుపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కళావతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం తగ్గడంతో పంటల సాగు కూడా తగ్గిపోయిందని, దీంతో రైతులు అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, బోరుబావుల కింద సాగు చేస్తున్న రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇబ్బందిగా మారుతున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద 200 పని దినాలు కల్పించి రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్తీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే ఉమర్, జిల్లా నాయకులు హిడమ, ఐఎఫ్టీయూ కొత్తగూడెం ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు మోత్కూరి మల్లికార్జునరావు, మంకెన వెంకటేశ్వర్లు, ఎన్.సంజీవ్, పీవైఎల్ పట్టణ అధ్యక్షుడు లిక్కి నరేష్, బత్తుల నాగరాజు, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కల్తీ రాములమ్మ, జిల్లా నాయకురాళ్లు బి.వెంకటమ్మ, సంధ్య, రాధా, నందిని, రాజేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

