ఐస్‌క్రీమ్ కారదిక!
వేసవి అంటేనే ఐస్‌క్రీమ్‌ల కాలం. బండి గణ గణ వినిపించిందంటే బడి పిల్లలంతా అక్కడే ఉంటారు. ఐస్‌క్రీమ్ అప్పుడు ఓ అద్భుత ఆహారంలా కనిపిస్తుంది. అయితే తినేంతలోనే ఎండ వేడిమికి అది కరిగి కారిపోతూ ఉండటం ఇక్కడ అసలైన ఇబ్బంది.
వేసవి అంటేనే ఐస్‌క్రీమ్‌ల కాలం. బండి గణ గణ వినిపించిందంటే బడి పిల్లలంతా అక్కడే ఉంటారు. ఐస్‌క్రీమ్ అప్పుడు ఓ అద్భుత ఆహారంలా కనిపిస్తుంది. అయితే తినేంతలోనే ఎండ వేడిమికి అది కరిగి కారిపోతూ ఉండటం ఇక్కడ అసలైన ఇబ్బంది. దీంతో ఈ చల్లదనాన్ని అరచేతుల నుంచి మోచేతుల దాకానే కాదు పిల్లల చొక్కాలూ ఆస్వాదిస్తాయి. తల్లుల్ని చిక్కులో పడేస్తాయి.
అంతమాత్రాన ఐస్‌క్రీమ్‌ను ఆమడ దూరం పెట్టేంత అవకాశమూ ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కించడానికి ‘సిలికాన్ ఐస్ క్రీమ్ హోల్డర్లు’ తయారవుతున్నాయి. అరచేయంత సైజులో పువ్వులు, బొమ్మల ఆకృతుల్లో వెడల్పాటి ప్లేటులా తయారవుతున్నాయివి.
సిలికాన్‌తో చేసిన వీటి మధ్యలో ఐస్‌క్రీమ్ లేదా పాప్సికల్ పెట్టుకోవడానికి వీలుగా గుండ్రటి రంధ్రం ఉంటుంది. దాని కింద తీసి పెట్టుకునే బిరడా కూడా ఉంటుంది. తినాలనుకున్నప్పుడు ఆ బిరడా తెరిచి అందులో ఐస్‌క్రీమ్ కొసను ఉంచితే పట్టుకోడానికి వీలుగా సిద్ధమైపోతుంది.
ఇక కరిగిపోయే ఐస్‌క్రీమ్ అంతా ఆ ప్లేట్లో జమ అవుతుంది. దీంతో మీద పడుతుందన్న భయం లేకుండా ఎంచక్కా ఎవరైనా ఐస్‌క్రీమ్ తినొచ్చు. రంగురంగుల్లో విభిన్న ఆకృతిలో వచ్చే ఇవి ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది ఉంటే ఇక ఐస్‌క్రీమ్ తినడం పిల్లలకే కాదు తల్లులకూ ప్రశాంతమే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

