మన ముఖం అందంగా కనిపించాలంటే ముందుగా పలు వరస సరిగా ఉండాలి. దంతాల మెరుపుదనంతోనే మనం ఎదుటి వారిని ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. అయితే, దంతాలను మెరిసేట్లుగా చేసుకోవడంలో బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం. నిత్యం రెండు నిమిషాల పాటు దంతదావనం చేయాలని వైద్యులు సెలవిస్తున్నారు. అయితే, ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి..? ఎప్పుడెప్పుడు చేసుకోవాలి..? అనేది చాలా మందికి తెలియదు.
మనం నిత్యం నిద్ర లేవగానే బాత్రూంలోకి పరిగెత్తి దంతాలు తోమడం చేస్తుంటాం. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరిగే తంతు. అయితే, చాలా మంది ఉదయం టిఫిన్ చేయగానే, మధ్యాహ్నం భోజనం కానిచ్చాక దంతాలను బ్రషింగ్ చేసుకోవడం మనం చూస్తుంటాం. కొంతమందైతే ఎప్పుడు, ఏది తిన్నా వెంటనే నోరు కడిగేసుకుంటారు. ఇలా చేయడం మంచిదని వారు నమ్ముతుంటారు.
మనం నిత్యం ఉదయం నిద్ర లేవగానే దంతదావనం చేస్తుంటాం. అలాకాకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత దంతాలను కడుక్కోవడం చాలా మంచిదని కొంతమంది నిపుణులు సెలవిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దంతాలపై ఎనామిల్ గట్టిగా ఉండటమే కాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు. అయితే, నిద్రపోయి లేచిన తర్వాత నోట్లో పాచి తయారై దంతాలపై బ్యాక్టీరియా తయారవుతుందని, అందుకని ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చెడు వాసనలు దూరం చేసుకోవచ్చని ఇంకొంత మంది నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే దంతాలను కడగటం వలన నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరి శరీరానికి లాభాన్ని చేకూరుస్తుందని వారు చెప్తున్నారు.
ఉదయం భోజనం అనంతరం పళ్లు శుభ్రపరుచుకోవాలని కొంతమంది దంత నిపుణులు సూచిస్తున్నారు, ఎందుకంటే ఉదయం భోజనం నుంచి ఆహార కణాలను నోటిలో ఎక్కువసేపు వదిలివేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అయితే, అల్పాహారం తీసుకున్న తర్వాత దంతాలను శుభ్రపరుచుకోవాలనుకుంటే.. ఆమ్ల ఆహారం తీసుకున్న వారైతే కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. బ్రెడ్, డ్రైఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, కాఫీ వంటి వాటిలో ఆమ్లాలు ఉంటాయి. అందుకని వీటిని తిన్న తర్వాత దంతాల శుభ్రపరచడంలో జాగ్రత్తగా ఉండాలి. దంతాలపై ఎనామెల్‌ను రక్షించడానికి కొంత సమయం పాటు వేచి ఉండటం అవసరం.
నిత్యం రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా మంచిదని దంత వైద్య నిపుణులు చెప్తుంటారు. దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరైన మార్గాలివి..
స్టెప్ 1: బ్రష్‌పై ఉండే బ్రిస్టల్స్ ముందుగా తడిపి దానికి కొద్ది మొత్తంలో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వేయాలి.
స్టెప్ 2: నెమ్మదిగా దంతాల ప్రతి మూలకు బ్రష్‌ను తీసుకెళ్లాలి. 2 నిమిషాలపాటు అన్ని మూలల్లో కడగాలి. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకుండా ప్రయత్నించాలి.
స్టేజ్ 3: మిగిలిపోయిన టూత్‌పేస్టును ఉమ్మివేసి నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి.
స్టేజ్ 4: బ్యాక్టీరియాను శుభ్రం చేయడానికి లేదా నాలుకను శుభ్రం చేయడానికి నాలుకపై కూడా నెమ్మదిగా బ్రష్‌తో రాయాలి.
స్టేజ్ 5: దంతాలను చక్కగా కడిగి ఆపై మౌత్ వాష్ పుక్కిలించడం అలవాటు చేసుకోండి.
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్‌లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..