e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News జైపూర్‌లో వ‌రుస‌ పేలుళ్లు.. 71 మంది దుర్మ‌ర‌ణం : చ‌రిత్ర‌లో ఈరోజు

జైపూర్‌లో వ‌రుస‌ పేలుళ్లు.. 71 మంది దుర్మ‌ర‌ణం : చ‌రిత్ర‌లో ఈరోజు

జైపూర్‌లో వ‌రుస‌ పేలుళ్లు.. 71 మంది దుర్మ‌ర‌ణం : చ‌రిత్ర‌లో ఈరోజు

పింక్ సిటీగా పేరుగాంచిన రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో వ‌రుస పేలుళ్లు సంభ‌వించాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో దాదాపు 71 మంది దుర్మ‌ర‌ణం పాల‌వ‌గా.. 150 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ పేలుళ్లు 2008 లో స‌రిగ్గా ఇదే రోజున జ‌రిగాయి.

జైపూర్ న‌గ‌రంలో ఉగ్ర‌వాదులు అమ‌ర్చిన బాంబులు పేల‌డంతో ఒక్క‌సారిగా పింక్ సిటీ దద్ద‌రిల్లింది. 15 నిమిషాల్లో 8 ప్రాంతాల్లో పేలుళ్లు జ‌రిగాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో దాదాపు 71 మంది చ‌నిపోయారు. 150 మందికిపైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వస్తుండ‌టం, హనుమాన్ దేవాలయాల వ‌ద్ద‌ ఎక్కువ మంది భక్తులు ఉండ‌టంతో మృతుల సంఖ్య పెరిగింది.

ప్ర‌జ‌ల‌కు ఎక్కువ హాని క‌లిగించేందుకు ఉగ్రవాదులు నగరంలో రద్దీ ప్రదేశాలను ఎంచుకున్నారు. ఘోరమైన పేలుడుకు ఆర్‌డీఎక్స్‌ను వినియోగించారు. ఉగ్రవాదులు సైకిళ్ళు, టిఫిన్ బాక్సుల‌ను ఉపయోగించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు పేల్చారు. దేశంలోని ప్రతి ప్రధాన నగరంలోనూ ఇదేమాదిరి పేలుళ్లు కొనసాగుతాయని న్యూస్ ఛాన‌ళ్ల‌కు పంపిన‌ మెయిల్‌లో ఉగ్ర‌వాదులు హెచ్చ‌రించారు. పేలుళ్లకు ఇండియ‌న్‌ ముజాహిదీన్లు బాధ్యత వహించారు.

పేలుళ్లపై దర్యాప్తు చేయడానికి ఏటీఎస్ ఏర్పడింది. ఈ కేసులో 11 మందిని నిందితులుగా ఏటీఎస్ పేర్కొన్న‌ది. వీరిలో మొహమ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్, సర్వార్ అజ్మీ, మహ్మద్ సల్మాన్‌లకు 2019 డిసెంబర్‌లో జైపూర్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉండ‌గా.. ఇద్దరు బాట్ల హౌస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సాక్ష్యం లేకపోవడంతో మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మ‌రొక‌రు ఇప్ప‌టికీ ప‌రారీలో ఉన్నాడు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2004: భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓట‌మి

2001: మాల్గుడి డేస్ రచయిత ఆర్‌కే నారాయ‌ణ‌న్‌ కన్నుమూత‌

2000: మిస్ యూనివ‌ర్స్ టైటిల్ గెల్చుకున‌న మిస్‌ ఇండియా లారా దత్తా

1998: పోఖ్రాన్‌లో రెండు అణు పరీక్షలు నిర్వహించిన భార‌త్‌

1967: భార‌త్ మూడో రాష్ట్ర‌ప‌తిగా జాకీర్ హుస్సేన్ ఎన్నిక

1956: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ జన‌నం

1952: స్వాతంత్ర్యం అనంత‌రం తొలిసారి స‌మావేశ‌మైన‌ రాజ్యసభ

1880: తొలిసారి ప‌ట్టాలెక్కిన ఎడిసన్ ఎలక్ట్రిక్ రైలు

ఇవి కూడా చ‌ద‌వండి..

సూపర్‌ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత

విడిపోతే క‌ష్టాలు ఎదుర్కొంటాం : అజీమ్ ప్రేమ్‌జీ

కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..

ఎన్నిక‌ల విధుల్లో చ‌నిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అల‌హాబాద్ హైకోర్టు

పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జైపూర్‌లో వ‌రుస‌ పేలుళ్లు.. 71 మంది దుర్మ‌ర‌ణం : చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement