హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మారెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మారెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు పరిశీలించాలని, ఆపతాలంలో రైతన్నలకు అండగా ఉండి భరోసా ఇవ్వాలని గులాబీ శ్రేణులకు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మారెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యుత్తు సరఫరా లేక సెల్ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదురొంటున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతుల కండ్లముందే నీళ్లపాలవుతున్నదని ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్ల నేడు రైతన్నలు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోయిన రైతాంగానికి బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలువాలి. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ పరిధిలో అకాల వర్షాలతో ప్రభావితమైన అన్ని మారెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. పంట తడిసిపోయి ఆందోళనలో ఉన్న ప్రతి రైతుకూ పార్టీ తరఫున భరోసా ఇవ్వాలి.
-కేటీఆర్
ఈ విపతర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ పరిధిలో అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మారెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పంట తడిసిపోయి ఆందోళనలో ఉన్న ప్రతి రైతుకూ పార్టీ తరఫున అండగా నిలువాలని, పూర్తి మద్దతు, సంఘీభావం తెలుపాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబడి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని దిశానిర్దేశం చేశారు.
మారెట్ యార్డుల్లో తడిసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలను తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మారెట్ యార్డుల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించి, మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతు కంటతడి పెడితే ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని హెచ్చరించారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.