సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ ఆదాయంలో దూసుకుపోతున్నాడు. స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచాడు

న్యూఢిల్లీ : మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ ఆదాయంలో దూసుకుపోతున్నాడు. స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానంలో నిలిచాడు. స్టార్ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డో, ఫెదరర్‌లను అధిగమించి గత సంవత్సరంతో పోలిస్తే రూ.971 కోట్లు ఎక్కువ సంపాదించాడు.
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2021 లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ -10 అథ్లెట్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఆదాయాల పరంగా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌లను అధిగమించాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, కోనార్ మెక్‌గ్రెగర్ వార్షిక ఆదాయం దాదాపు రూ.1,324 కోట్లు. ఇందులో ఎండార్స్మెంట్, అడ్వర్టైజింగ్, ఇతరత్రాల నుంచి దాదాపు రూ.1,163 కోట్లు సంపాదించాడు. కాగా, క్రీడల ద్వారా దాదాపు రూ.161 కోట్లు సంపాదించారు. గతేడాది ఈయన ఆదాయం దాదాపు రూ.353 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో 16 వ స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో అర్జెంటీనాకు చెందిన స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో ఉన్నారు. మెస్సీ వార్షిక ఆదాయం దాదాపు రూ.956 కోట్లు. 2020 లో ఇవి దాదాపు రూ.765 కోట్లుగా ఉండేవి. గత సంవత్సరం రెండవ స్థానంలో ఉన్న రొనాల్డో ఈసారి జాబితాలో మూడవ స్థానానికి పడిపోయాడు. అతని వార్షిక ఆదాయం దాదాపు రూ. 883 కోట్లు. గత ఏడాది ఈయన సంపాదన రూ.772 కోట్లు.
అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డెక్ ప్రెస్కాట్ వార్షిక ఆదాయం రూ.791 కోట్లతో నాలుగో స్థానంలో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ రూ.710 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితా తయారుచేసేందుకు క్రీడాకారుల ఆదాయాన్ని గత ఏడాది మే 1 నుంచి ఈ ఏడాది మే 1 వరకు లెక్కలోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్‌లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

