Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జపాన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక యానిమే అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అనంతరం చేసిన జపాన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు కేవలం ఆమె అందం, జపాన్ అందాల వల్లే కాదు.. అందులో కనిపించిన ఓ ప్రత్యేక వ్యక్తి కారణంగా కూడా వైరల్‌గా మారాయి.తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో జపాన్ పర్యటనకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేసిన రష్మిక, “ఈ ఏడాది జపాన్ ట్రిప్ మరింత ప్రత్యేకంగా, సరదాగా సాగింది” అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌లో ఆమె జపాన్ వీధుల్లో విహరిస్తూ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదిస్తూ కనిపించింది.
ఈ ట్రిప్‌లో రష్మిక ధరించిన సంప్రదాయ జపనీస్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుకాటా అనే సాంప్రదాయ వస్త్రధారణలో ఆమె ఎంతో అందంగా కనిపించింది. రంగురంగుల పూల డిజైన్లతో అలంకరించిన యుకాటాకు సరిపోయేలా ఆమె చేసిన స్టైలింగ్ అభిమానులను ఆకట్టుకుంది. జపాన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ లుక్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఫోటోలతో పాటు షేర్ చేసిన వీడియోల్లో రష్మిక తన చిలిపి స్వభావాన్ని మరోసారి చూపించింది. జపాన్‌లోని పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తూ, సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది. ఆమె నవ్వులు, అల్లరి చేష్టలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ ఫోటోల్లో ఎక్కువ చర్చకు కారణమైన విషయం ఒకటి ఉంది. కొన్ని చిత్రాల్లో ఒక వ్యక్తి కనిపించినప్పటికీ, అతని ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడినట్లు నెటిజన్లు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండేనని అభిమానులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్‌పై వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. “ముఖం కనిపించకపోయినా ఎవరో మాకు తెలుసు” అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. జపాన్ ట్రిప్ ఫోటోల కంటే వాటిలో కనిపించిన ఆ వ్యక్తిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది.