అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది
పెద్ది సుదర్శన్‌రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా, యూత్ క్లబ్ అధ్యక్షుడిగా మొదలైన పెద్ది ప్రస్థానం ఉద్యమకారుడిగా, జడ్పీటీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి దాకా చేరుకున్నారు.
- ఉద్యమ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభం
- ట్రాక్టర్ డ్రైవర్ నుంచి ఎమ్మెల్యేగా
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు
నర్సంపేట, జూలై 31: పెద్ది సుదర్శన్‌రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా, యూత్ క్లబ్ అధ్యక్షుడిగా మొదలైన పెద్ది ప్రస్థానం ఉద్యమకారుడిగా, జడ్పీటీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి దాకా చేరుకున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది అమృతమ్మ-రాజిరెడ్డి దంపతులకు జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయ అ రంగ్రేటం చేశారు. నల్లబెల్లి మండల యువజ్యోతి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో తన అనుచరులతో కలిసి చేరారు.
అనతికాలంలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లబెల్లి మండలం నుంచి రైతు నాగళి గుర్తుపై పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందడమే కాకుం డా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ఆయన వ్యవహరించారు. 2004 డిసెంబర్లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. 2005 సంవత్సరం చివరలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, అనంతరం ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మ డి జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడుతూనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పెద్ది వరంగల్ జిల్లా నుంచి సారథ్యం వహించారు. కేసీఆర్ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉద్యమ ఉధృతిని ఇత ర ప్రాంతాలకు విస్తరించేలా కృషి చేశారు.
ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తా, రైలురోకోలు వంటి వివిధ ఆందోళన కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొని ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలకు స్పూర్తిగా నిలిచారు. ఈక్రమంలో పోలీసుల లాఠీదెబ్బలు చవిచూడడమే కాకుండా కేసుల పాలయ్యారు. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలను విజయవంతం చేసి ఆయన ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ ఘట్టంలా నిలిచే విధంగా మహాగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసి కేసీఆర్ మెప్పు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2004లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ రాగా, పెద్ది ఆయన గెలుపునకు ఎనలేని కృషి చేశారు. అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సివిల్ సైప్లయ్ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్ల పాటు కొనసాగా రు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2018లో రెండోసారి పోటీ చేసేందుకు కేసీఆర్ అవకాశం కల్పించడంతో ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. అయిన ప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
నెక్కొండ రైల్‌రోకోతో ఢిల్లీలో దడపుట్టించిన నేత
నెక్కొండ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు కేసీఆర్ పిలుపు మేరకు నెక్కొండ రైల్వే స్టేషన్లో చేపట్టిన 18 గంటల రైల్‌రోకో మైలురాయిగా నిలిచింది. ఉద్యమకారులను సమీకరించి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. ఈ నిరసనతో నెక్కొండ పేరు, పెద్ది నాయకత్వ పటిమ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్మోగింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

