N Chandrasekaran : టాటా గ్రూప్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. టాటా సన్స్ గ్రూప్ ఆయనను ఛైర్మన్‌గా మూడోసారి నియమించింది. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గురువారం ముంబైలో జరిగిన బోర్డు మీటింగ్‌లో చంద్రశేఖరన్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండుసార్లు టాటా గ్రూప్ చైర్మన్‌గా ఎన్నికైన చంద్రశేఖరన్ గత ఆగష్టు 12న ఈ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ బాధ్యతల్లో కొనసాగలేనని స్పష్టం చేశారు.
అయితే, చంద్రశేఖరన్‌నే మళ్లీ నియమించడానికి బలమైన కారణ ఉంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు సంబంధించి మినహాయింపు కోరుతూ టాటా గ్రూప్ ఇటీవల ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. కానీ, ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. దీంతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడం అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా నాయకత్వ మార్పు మంచిది కాదనే ఉద్దేశంతో తిరిగి చంద్రశేఖరన్‌నే నియమించాలని బోర్డు భావించింది. టాటా గ్రూప్‌లో అత్యధిక వాటా కలిగిన టాటా సన్స్‌కు ఈ నియామకం చాలా కీలకం.
ఆయన నియామకంతో స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌కు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగుతుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. 2017 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. మరో ఐదేళ్లపాటు చైర్మన్‌గా ఉంటారు. 2017లో తొలిసారి చైర్మన్ కాగా, 2022లో మరోసారి నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉంది. చంద్రేశఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక వ్యాపారాలకు విస్తరించింది. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో దూసుకెళ్తోంది.
చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా నియమించినప్పటికీ.. ఈ విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది. ఆయనను పదవిలో కొనసాగాల్సిందిగా ది నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. అనంతరం ఆయన అంగీకరిస్తే మరోసారి చైర్మన్‌గా కొనసాగుతారు.