The Paradise | 800లకు పైగా ప్రీమియర్ షోలు.. నాని ‘ది ప్యారడైజ్’ మూవీకి సరికొత్త రికార్డులు!
The Paradise | టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
The Paradise | టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, సినిమా విడుదలకు ముందే సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సెప్టెంబర్ 23న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకంగా 800లకు పైగా భారీ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో నాని ఇప్పటివరకు చూడని సరికొత్త రగ్గడ్ మరియు మాస్ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి థియేటర్లలో ‘జడల జమాన’ అధికారికంగా ప్రారంభం కానుండటంతో నాని అభిమానులు, మాస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం అత్యుత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

