KTR | కేటీఆర్‌కు అండగా ఉన్నడని చెప్పి అబ్బాడి అనిల్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అబ్బాడి అనిల్ రెడ్డి అనే తమ్ముడు మా పార్టీలో పనిచేస్తడు. రెడ్లకులంలో పుట్టిండు.. మా పార్టే నేను కాదంటలేను. కానీ పేదవాడు ఆస్తిపాస్తులు పెద్దగా ఏం లేవు. అయితే ఇదెప్పుడు ఏండ్లుగా వాళ్లు సాగుచేసుకుంటున్న భూమిని రెండెకరాలు ఎప్పటి నుంచో మోఖాలో ఉన్నడని చెప్పి అధికారులు పంచనామా చేసి పట్టా ఇచ్చిర్రు. ఈ పిలగాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నడు.. బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నడు కేటీఆర్‌కు అండగా ఉన్నడని చెప్పి ఈయనను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండన్నారు.
అనిల్ రెడ్డి దొరకకపోతే ఈయన బాబాయి అబ్బాడి రాజిరెడ్డి.. ఆయనకు పాపం గుండె జబ్బుంది. ఆ రాజిరెడ్డి పేద కుటుంబం.. 30 గుంటలు పట్టా.. నా మీద కోపంతో ఆయనను తీసుకెళ్లి 14 రోజులు జైలులో పెట్టిండని కేటీఆర్ మండిపడ్డారు. ఎంత దిగజారుడు రాజకీయమంటే బొల్లి రామ్మోహన్ అని మా నాయకుడు ఒకాయన ఉన్నడు.. ఆయనేదో కబ్జా పెట్టిండని ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తడు.. ఈ రామ్మోహన్‌కు నేను ఫోన్ చేసిన.. ఏందయ్యా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నడంటే.. ఆయన స్పష్టంగా చెప్పిండు.. 2007లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వముంది.. డాక్యుమెంట్ నంబర్ 7289 2007లో డిసెంబర్ 12న ఈ రామ్మోహన్ అనే వ్యక్తి కొనుగోలు చేసి అప్పుడు రిజిస్టర్ చేసుకున్నడు. మా ప్రభుత్వం వచ్చినంక ఏం జరుగలేదు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భూమిని ఆక్రమిత భూమి, కబ్జా భూమి అని అంటున్నడు.. ముఖ్యమంత్రికి తెలివితక్కువోడు ఎవడో చెప్పినట్టున్నడన్నారు.
ఆ రైతులకిచ్చిన భూములన్నీ కబ్జా భూములు అంటడు..
వీర్నపల్లి మండలంలో రంగం పేట అనే ఒక ఊరు ఉంటది. ఈ మండలంలో రైతులకు మొత్తం మేం పోడుపట్టాలిచ్చినం. వారు కబ్జాల్లో ఉంటే ఆ పట్టాలు ఆ గిరిజన రైతులకిస్తే.. ఇవాళ ముఖ్యమంత్రి ఆ రైతులకిచ్చిన భూములన్నీ కబ్జా భూములు అని మాట్లాడుతున్నడు.. సిరిసిల్ల పట్టణంలోకమ్యూనిస్టుల కాలంలో ఇది వరకు రాయిని చెరువు అని ఉంటుండే. సిరిసిల్ల సగం పట్టణం రాయిని చెరువే. ఆ చెరువునే ఆనాడు కమ్యూనిస్టులే సీహెచ్ రాజేశ్వర్ రావు ఆ చెరువునే ఎండిపోతే అందులో పట్టాలు కొట్టి కార్మికులకు 60 గజాలు, 70 గజాలు చొప్పున కార్మికులకు ప్లాట్లు పంచిర్రు. వాటిని మా ప్రభుత్వం వచ్చినంక రెగ్యులరైజ్ చేసింది.. దాన్ని ఇయ్యాళ్ల ముఖ్యమంత్రి కబ్జా అంటడు. మేం జీవో నంబ్ 58,59 కింద పట్టాలిస్తే అది కబ్జానట.
సిరిసిల్ల పట్టణం పెద్దూరు, సర్దాపూర్, బాబాజీ కాలనీ జగ్గారావుపల్లి అనే ఊరు ఉంటది. అక్కడ 90 శాతం ప్రభుత్వ భూమే ఉంటది. పేరుకు రికార్డులో ప్రభుత్వ భూమే .. కానీ అక్కడ ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నరు.. పట్టణం పక్కనే ఉంది కాబట్టి ఇండ్లు కట్టుకుంటున్నరు.. కాబట్టి పట్టణం పెరిగిపోతయి.. ఇయ్యాళ్ల అవన్నీ కబ్జా అని ముఖ్యమంత్రి ఆరోపణ. అంటే ఎంత అసమగ్రంగా ఎంత సిల్లీగా ఎంత చిల్లరగా ఈ ప్రభుత్వం నడస్తుందనేందుకు మీకొక నాలుగైదు ఉదాహరణలు చెప్పానన్నారు.
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో మా వాళ్లు 8000 ఎకరాలు కబ్జా చేశారని చిల్లర వ్యాఖ్యలు చేశాడు
కొండూరు రవీందర్ రావు టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు 2014 తర్వాత తాను ఒక్క గజం భూమి కూడా కొనలేదు, తీసుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నాడు
జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ నక్సలైట్..… https://t.co/PFX8ZjJQBB pic.twitter.com/UvSz8sAfDw
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026