జల సిరులు.. ఉమ్మడి జిల్లాలో మూడ్రోజులు కురిసిన వానలు
మూడ్రోజులు దంచి కొట్టిన వర్షాలు శుక్రవారం కాస్త శాంతించాయి. కరువు పరిస్థితులు దాపురించి ఆందోళనకు గురవుతున్న అన్నదాతలను భారీ వర్షాలు మురిపించాయి.
- భారీ వర్షాలతో అలుగు పోస్తున్న చెరువులు
- ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు
- ఆనందంలో అన్నదాతలు
- ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
- ప్రాజెక్టులోకి 61,111 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మోర్తాడ్/నిజాంసాగర్, జూలై 31: మూడ్రోజులు దంచి కొట్టిన వర్షాలు శుక్రవారం కాస్త శాంతించాయి. కరువు పరిస్థితులు దాపురించి ఆందోళనకు గురవుతున్న అన్నదాతలను భారీ వర్షాలు మురిపించాయి. మంగళవారం నుంచి గురువారం వరకు దంచికొట్టడంతో చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరింది. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతున్నది. తరలి వస్తున్న జల సిరులు కొత్త ఆశలను మోసుకొస్తుండగా, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది.
ఎస్సారెస్పీకి రెండ్రోజల్లోనే 8 టీఎంసీలు..
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం రాత్రి ఎస్సారెస్పీకి ఈ సంవత్సరంలోనే అత్యధిక వరద 76,224 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఇది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు, రెండ్రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి దాదాపు 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. బుధవారం 15 టీఎంసీల మేర నీరుండగా, శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 23.866 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 291క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తుంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1070 అడుగులు(23. 866టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది.
నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. 4,642 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం1405.00 అడుగులు (17.80 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 1396.30 అడుగులు (7.84 టీఎంసీల) నీరు నిల్వ ఉంది.
సింగితం మూడు గేట్ల ఎత్తివేత..
నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఎగువ నుంచి 661 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడు వరద గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసారు. నీటి పారుదల శాఖ ఏఈఈలు అక్షయ్, సాకేత్, వర్క్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటి విడుదలను ప్రారంభించారు.
- భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి పెద్ద చెరువు నిండుకుండలా మారింది. పాక్షికంగా అలుగు పోస్తున్నది. ఈ దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు తరలిరావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది.
- పొతంగల్ మండలంలోని కొల్లూరు, దోమలెడ్గి వాగు దాటేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మరోవైపు, పొతంగల్‌లోని సబ్ స్టేషన్లోకి వర్షపు నీరు చేరి జలమయంగా మారింది.
- ధర్పల్లి మండల కేంద్రంలోని గుడి తండా పరిధిలోని లోతట్టు పొలాలు నీటమునిగాయి.
- నవీపేట మండలంలోని నిజాం పూర్ మాటు కాల్వకు గండి పడింది. పక్కనే ఉన్న పంట పొలాల్లోకి భారీగా రావ డంతో పైర్లు నీట మునిగాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

