Ponnam Prabhakar | పవన్ కల్యాణ్‌కు పైసలిస్తే ఏ నటన అయినా చేస్తాడు.. ఏ డ్రెస్ వేసుకోనైనా ఎగురుతాడు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. అణువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ జెండాను మోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కండ్లు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి.. అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడటా
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరు
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము
-… https://t.co/iE5Gyinmft pic.twitter.com/lEsEZWQeE6
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని పొన్నం ప్రభాకర్ అన్నారు. కన్నతల్లికి గాజులు కొనలేని వాడు.. పినతల్లికి ఒడ్డాణం చేయిస్తాడట అన్నట్లుగా.. ఏపీలో చేయలేనిది.. తెలంగాణకు వచ్చి చేస్తాననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించారు. నవనిర్మాణ సభలను గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టిండచమే లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు
నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదు?
– పొన్నం ప్రభాకర్ pic.twitter.com/OusnuMa5xF
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
పవన్ కల్యాణ్‌ను సినిమా హీరోగా అభిమానించవచ్చు.. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సినిమా నటుడు అని అన్నారు. పవన్ కల్యాణ్‌కు పైసలిస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడని.. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్‌కు అనుగుణంగానే నటిస్తున్నాడని అన్నారు. బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని.. నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా అని పవన్‌కల్యాణ్‌కు సవాలు విసిరారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకు అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. సినిమాల్లో దేశభక్తిని చూపించడం కాదు.. నిజజీవితంలో ప్రజల కోసం నిలబడాలని హితవు పలికారు. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు.. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కల్యాణ్ ముందు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Janasena
- Karimngar
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

