ముంబై: ఆర్మీ వైద్యులు 9 నెలల పసికందు ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారి మింగిన చిన్న ఎల్ఈడీ ఊపిరితిత్తులో ఇరుక్కున్నది. ఈ నేపథ్యంలో ఆర్మీ డాక్టర్లు అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చిన్నారి ఉపిరితిత్తులోని ఎల్ఈడీని సురక్షితంగా తొలగించారు. (LED Bulb in Baby’s Lung) మహారాష్ట్రకు చెందిన 9 నెలల శిశివు పొరపాటున చిన్న ఎల్ఈడీని మింగింది. పూణేలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో-థొరాసిక్ సైన్సెస్ (ఏఐసీటీఎస్)కు ఆ చిన్నారిని తరలించారు.
కాగా, ఆర్మీ డాక్టర్లు ఆ శిశువును పరిశీలించారు. ఆ చిన్నారి మింగిన చిన్న ఎల్ఈడీ, ఎడమ ఊపిరితిత్తులలో లోతుగా ఇరుక్కున్నట్లు గుర్తించారు. దీంతో ఆర్మీ వైద్యులు బ్రాంకోస్కోపీ సర్జరీ నిర్వహించారు. కెమెరాతో కూడిన ఒక సన్నని, వంగే గొట్టాన్ని పసికందు గొంతు ద్వారా ఊపిరితిత్తులలోకి పంపారు. ఎడమ ఊపిరితిత్తుల వాయుమార్గంలో లోతుగా ఇరుక్కున్న తుప్పు పట్టే తీగలున్న ప్రమాదకరమైన ఎల్ఈడీని సురక్షితంగా బయటకు తీశారు. అరుదైన సర్జరీ ద్వారా 9 నెలల పసికందు ప్రాణాలను కాపాడినట్లు ఎక్స్ పోస్ట్‌లో ఆర్మీ పేర్కొంది. దీంతో ఆర్మీ డాక్టర్లపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
Specialists at Army Institute of Cardio-Thoracic Sciences (#AICTS), Pune successfully saved the life of a 9-month-old infant after removing a hazardous LED bulb with corrosive wires lodged deep inside the airway of the left lung through a highly complex bronchoscopic procedure.… pic.twitter.com/iraVg0kJmc
— Southern Command INDIAN ARMY (@IaSouthern) May 28, 2026