కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..? పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయిన మంత్రి పొన్నం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో నవ నిర్మాణ సభ పెడుతామన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమన్నారు.
సినిమాల్లో జోకర్, విలన్, రౌడీ ఏ పాత్రలో నటించిన అది ఆయన వ్యక్తిగతమని అంతేకానీ, బీజేపీతో కలిసి తెలంగాణలో మతాల మధ్య చిచ్చుపెడుతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడని ఎద్దేవా చేశారు. నవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎందుకు పెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వారి నాటకాలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు.
కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడటా
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరు
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము
-… https://t.co/iE5Gyinmft pic.twitter.com/lEsEZWQeE6
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

