Firing | అమెరికాలో మళ్లీ కాల్పులు.. 12 మందికి తీవ్ర గాయాలు
Firing | అమెరికా (USA) లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఒహియో రాష్ట్రం (Ohio state) లోని టోలెడో (Toledo) నగరంలో శనివారం సాయంత్రం జరిగిన 'ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్ (Old West End Festival)' లో దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
Firing : అమెరికా (USA) లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఒహియో రాష్ట్రం (Ohio state) లోని టోలెడో (Toledo) నగరంలో శనివారం సాయంత్రం జరిగిన ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్ (Old West End Festival)’ లో దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, పండుగ వాతావరణంలో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో జనం ప్రాణాలు అరచేతబట్టుకుని పరుగులు తీశారు. చారిత్రాత్మక నగరమైన టోలెడోలో 53వ వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
లైవ్ మ్యూజిక్, ఫ్యామిలీ ఈవెంట్లతో కుటుంబాలన్నీ పండుగను ఆస్వాదిస్తున్న తరుణంలో అమెరికా కాలమాన ప్రకారం.. సాయంత్రం 5:37 గంటల ప్రాంతంలో డెలావేర్, గ్లెన్వుడ్ అవెన్యూల సమీపంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకరిపై ఒకరు పరస్పరం కాల్పులు జరుపుకోగా అక్కడ గుమిగూడిన సామాన్య ప్రజలు ఈ క్రాస్ఫైరింగ్లో చిక్కుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే టోలెడో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు.
గాయపడిన వారిలో 14 ఏళ్ల మైనర్ల నుంచి 61 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారని డిప్యూటీ పోలీస్ చీఫ్ జో హెఫెర్నన్ తెలిపారు. ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందించి, బాధితులను వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ హింసాత్మక ఘటన తర్వాత ఉత్సవానికి సంబంధించిన మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు స్థానిక యంత్రాంగం ప్రకటించింది. కాల్పులకు తెగబడిన నిందితులెవరూ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. వారు ఘటనా స్థలం నుంచి పరారైనట్లు అధికారులు నిర్ధారించారు.
పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను, ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలను పరిశీలిస్తున్నారు. పండుగకు వచ్చిన వారు తమ మొబైల్స్‌లో తీసిన ఫోటోలు లేదా వీడియోలను దర్యాప్తు కోసం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘోర కాల్పుల ఘటనను ఒహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

