పాట్నా: ఒక రైలు బోగి కిటికీకి పెద్ద పెట్టెను కొందరు ప్రయాణికులు కట్టారు. దానిని లోపల నుంచి గట్టిగా పట్టుకున్నారు. ఆ రైలు స్టేషన్ నుంచి కదిలిన వీడియోతో పాటు భారీ పెట్టెను రైలులోకి ఎక్కించేందుకు మహిళలు ప్రయత్నించిన మరో వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (passengers haul giant metal trunk to train) ఈ రెండు సంఘటనలు బీహార్‌లో జరిగాయి. ఒక రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు పెద్ద పెట్టెను రైలు బోగి కిటికీకి బయట నుంచి కట్టారు. రైలు బయటకు వేలాడుతున్న ఆ పెట్టెను లోపల నుంచి గట్టిగా పట్టుకున్నారు.
కాగా, ఆ రైలు స్టేషన్ నుంచి కదలడంతో ఒక వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. ‘ఇది బీహార్’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో రైలుతో పాటు ప్రయాణికుల భద్రతపై పలువురు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ పెట్టె స్తంభానికి ఢీకొడితే రైలు ప్రమాదాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అనుమతించిన సంబంధిత రైలు గార్డు, స్టేషన్ మాస్టర్, టీటీఈ, రైల్వే పోలీసులు, రైల్వే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
అయితే ఈ వీడియో క్లిప్‌పై రైల్వే పెద్దగా స్పందించలేదు. ‘దయచేసి స్టేషన్ పేరు, రైలు నంబర్, మీ మొబైల్ నంబర్‌ను మాకు తెలియజేయండి. సమస్య త్వరితగతిన పరిష్కారం కావడానికి మీరు నేరుగా ‘రైల్‌మదద్’లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 139 నంబర్‌కు కాల్ చేయవచ్చు’ అని ఎక్స్‌లో పేర్కొంది.
మరోవైపు బీహార్‌లోని మరో రైల్వే స్టేషన్లో ఇలాంటి మరో సంఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పెద్ద పెట్టెను రైలులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో వారు ఆ రైలులోకి ఎక్కలేకపోయారు. ఆ పెట్టెను తలపై మోసుకుని వెళ్లిపోయారు. బీహార్‌కు చెందిన అభిషేక్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
इस तरह के बक्से स्टेशन पर यह महिला लेकर चली कैसे गई? आगे जाकर यह किसी न किसी खंबे से टकरा जाएगा। pic.twitter.com/YmF35iZppm
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 4, 2026
🚨Passengers attempt to load a giant metal trunk into a train coach, leaving netizens stunned. pic.twitter.com/ZEFlk97BSa
— Backchod Indian (@IndianBackchod) June 4, 2026