Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం

Amazon miniTV : అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్( Amazon ) భారత్‌లో ఇ-కామర్స్ రంగంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ దూసుకుపోతోంది. అమెజాన్ ఇండియా, అమెజాన్ప్రైమ్లను కోట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారు. తాజాగా అమెజాన్ మినీ టీవీ( Amazon miniTV ) స్ట్రీమింగ్ సర్వీస్‌ను శనివారం భారత్‌లో లాంచ్ చేసింది. అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఇది ఉచితంగా అందుబాటులో ఉంది. యాప్‌లో వెబ్ సిరీస్, కామెడీ షోలు, టెక్ న్యూస్, ఆహారం, బ్యూటీ, ఫ్యాషన్ తదితర కంటెంట్‌ను అందిస్తుంది.
కంటెంట్‌ను పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు. కాకపోతే ఇందులో ప్రకటనలు వస్తాయి.
ప్రస్తుతం మినీటీవీ ఆండ్రాయిడ్‌లోనే అందుబాటులో ఉండగా, రాబోయే రోజుల్లో ఐఓఎస్ యాప్, మొబైల్ వెబ్‌కు సేవలను విస్తరించనున్నారు. కొత్త సర్వీస్ లాంచ్‌తో వీడియో ఎంటర్టైన్మెంట్ విభాగంలో అమెజాన్ రెండు స్ట్రీమింగ్ యాప్‌లను కలిగి ఉంది. ఇందులో ఒకటి మినీటీవీ కాగా మరొకటి ప్రైమ్ వీడియో.
‘మినీటీవీ పూర్తిగాఉచితం. దీని కోసం ప్రత్యేక యాప్ అవసరం లేదు. ప్రైమ్ వీడియో కంటెంట్‌ను చూసేందుకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అవసరం. ఇందులో ఇంగ్లీష్‌తో పాటు తొమ్మిది భారతీయ భాషల్లో అమెజాన్ ఒరిజినల్స్, తాజా సినిమాలు, టీవీ షోల కంటెంట్ ఉందని’ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

