28న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

రాష్ర్టాలకు నష్టపరిహారం పెంపు, వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దుపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ, మే 15: ఏడు నెలలుగా సమావేశంకాని జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ఈ నెల 28న భేటీ కానున్నది. జీఎస్టీ కౌన్సిల్‌ను సమావేశ పర్చాలంటూ పలు రాష్ర్టాలు కోరుతున్న నేపథ్యంలో సమావశపు తేదీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనా సంక్షోభం, లాక్డౌన్లతో పలు రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లు పడిపోవడంతో కేంద్రం ఎక్కువ పరిహారాన్ని ఇవ్వాల్సిరావడం, వ్యాక్సిన్లు, ఇతర కీలక వైద్య ఉత్పత్తులపై జీఎస్టీని రద్దుచేయాలంటూ రాష్ర్టాలు డిమాండ్ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యూఢిల్లీలో మే 28న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది’ అంటూ ఆర్థిక శాఖ ట్వీట్లో పేర్కొంది. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్రం, రాష్ర్టాల సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొంటారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

