మందు తాగడానికి వంద రూపాయలు ఇవ్వలేదనే కారణంతో భార్యను చంపిన భర్తకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.37వేల జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా జడ్జి జయరాజ్ మంగళవారం తీర్పు ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఇన్చార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
Get together | అందరు విశ్రాంత ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. వ్యాపారులే. ఏడు పదుల వయస్సులో ఒక చోటకు చేరారు. మనవళ్లు... మనవరాండ్లతో వచ్చిన ఆ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
TB Patients | అర్వపల్లి మండల పరిధిలో ప్రస్తుతం క్షయ వ్యాధి మందులు వాడుతున్న బాధితులకు న్యూట్రీషన్లు కిట్లను మంగళవారం డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో అర్వపల్లి ఆరోగ్యం కేంద్రం నందు పంపిణీ చేశారు.
ఈనెల 28న నల్లగొండలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పూలే, అంబేద్కర్ జన జాతరను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంటెపాక కృష్ణ పిలుపునిచ్చారు.
కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.