రామగిరి (నల్లగొండ), జూన్ 1 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు ప్రజలు పిలుపునిచ్చారు. 11వ వార్డు అంబేద్కర్ నగర్ (SC కాలని) లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే సంక్షేమ పథకాలను పొందగలుగుతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంటరానితనం, వివక్షత నేటికీ సమాజంలో కొనసాగుతుందని కులరహిత సమాజాని కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. నివాళులు అర్పిస్తున్న 11వ వార్డు వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.