Ranveer Singh: 10 కోట్లు ఇవ్వాలని రణ్వీర్ సింగ్‌ను బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. 10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి వాయిస్ నోట్ రూపంలో బెదిరింపు వచ్చిందని ఓ మీడియా కథనం పేర్కొన్నది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్(Ranveer Singh)కు బెదిరింపులు వచ్చాయి. 10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది.అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి వాయిస్ నోట్ రూపంలో బెదిరింపు వచ్చిందని ఓ మీడియా కథనం పేర్కొన్నది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. క్రైం బ్రాంచ్ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. నెంబర్ ఎక్కడిదో కనుక్కొనేందుకు అమెరికా భద్రతా సిబ్బందితో పోలీసులు టచ్‌లో ఉన్నారు.
బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. సాంకేతిక ఆధారాల కోసం అధికారులు వెతుకుతున్నారు. కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌కు భద్రతను పెంచనున్నారు. గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. ఆ గ్యాంగ్ అనేక మంది సెలబ్రిటీలను బెదిరించిన దాఖాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

