మునుగోడు మే 29 : రత్తిపల్లి గ్రామంలో గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎంపీడీవో విజయభాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ చెత్త వేస్తున్న ప్రదేశాలను గుర్తించారు. మురుగునీరు వీధిలోకి వస్తున్న ప్రదేశాలను గుర్తించి, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పారిశుధ్య పనులకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.
అలాగే పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరగాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది ,ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ వాటర్ మెన్ శంకరయ్య ,గాదే లక్ష్మి, గాదే సైదమ్మ పాల్గొన్నారు