Pakistan Cricket Board: పాక్ ప్లేయర్ల చెత్త పర్ఫార్మెన్స్.. ఒక్కో క్రికెటర్‌పై 17 లక్షల జరిమానా
Pakistan Cricket Board: పాకిస్థానీ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఫైన్ వేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లపై 17 లక్షల జరిమానా విధించింది. బాబర్ ఆజమ్, షహీన్ అఫ్రీది, షాదాబ్ ఖాన్ లాంటి ఆటగాళ్లకు కూడా ఫైన్ వేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కఠిన చర్య తీసుకున్నది. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు సూపర్ 8 స్టేజ్‌లోనే వైదొలిగిన విషయం తెలిసిందే. సెమీస్‌కు చేరకపోవడం పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు జరిమానా విధించింది. భారీగా ఫైన్ వేసింది. కీలక ప్లేయర్లపై ఒక్కొక్కరికి సుమారు 5 మిలియన్ల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించింది. అంటే ఒక్కో ప్లేయర్ సుమారు 17 లక్షలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
టోర్నీలో ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయని క్రికెటర్లకు ఈశిక్ష పడినట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, పేస్ బౌలర్ షహీన్ అఫ్రీది, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌పైన కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జరిమానా విధించింది. తొలి రౌండ్లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సరైన ఆటతీరును ప్రదర్శించని క్రికెటర్లకు ఈ జరిమానా వేసినట్లు తెలుస్తోంది. చెత్త పర్ఫార్మెన్స్ను ఏమాత్రం సహించేది లేదని పీసీబీ వెల్లడించింది. భవిష్యత్తులో మెరుగైన ఆటను ప్రదర్శించిన క్రికెటర్లకు మాత్రమే ప్రోత్సాహకాలు ఉంటాయని పీసీబీ చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

