రాజన్న సిరిసిల్ల స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : తరం మారింది.. యంత్రం వచ్చింది.. కానీ మగ్గం నేసిన, రాట్నం తిప్పిన చేనేత బతుకు మలి వయసులోనూ జీవనోపాధి కోసం పోరాడుతూనే ఉన్నది. కష్టాన్ని కాడికి కట్టి.. రక్తాన్ని దారంగా మార్చి.. లోకానికి అందం తొడిగిన చేతులు ఇప్పటికీ కష్టపడుతూనే ఉండటం జీవిత చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నది.
మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహేశ్వర చేనేత సంఘంలో కనిపించిన దృశ్యం ఈ వాస్తవాన్ని కండ్లకు కడుతున్నది. ఓ వృద్ధురాలు రాట్నం తిప్పుతూ, మరో నేతన్న మగ్గం నేస్తూ.. ఓ చిన్నారి చదువులో నిమగ్నమై కనిపించగా, ‘నమస్తే’ క్లిక్‌మనిపించింది.