గట్టుప్పల్, మే 30 : మండల కేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి కుంకుమార్చన, దీపారాధనల తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కంఠ మహేశ్వరుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం గౌడ సంఘం పెద్దలు పల్లె రవి కుమార్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌఢ సంఘం నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బండారు చంద్రయ్య గౌడ్, బొల్లేపల్లి వెంకటేశ్ గౌడ్, మాదగోని సత్యనారాయణ గౌడ్, మాదగోని గోపాల్ గౌడ్, యాదయ్య, కర్నాటి అబ్బయ్య గౌడ్, రాఘవేందర్ గౌడ్, మాధగోని వెంకటేశ్ గౌడ్, పెద్దదేనా ప్రసాద్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ అలీ, మేకల రామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.