KD Song | నోరా ఫతేహి ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదం.. గీత రచయిత రఖీబ్ ఆలం వివరణ
KD Song | బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించిన తాజా పాట ‘సర్కే చునార్ తేరీ సర్కే’ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పాటలోని సాహిత్యం, నోరా ఫతేహి చేసిన డాన్స్ మూమెంట్స్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పాటలోని కొన్ని పదాలు అసభ్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ గీత రచయిత రఖీబ్ ఆలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
KD Song | బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించిన తాజా పాట ‘సర్కే చునార్ తేరీ సర్కే’ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పాటలోని సాహిత్యం, నోరా ఫతేహి చేసిన డాన్స్ మూమెంట్స్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పాటలోని కొన్ని పదాలు అసభ్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ గీత రచయిత రఖీబ్ ఆలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రఖీబ్ ఆలం ఈ వివాదంపై స్పందిస్తూ తన వాదనను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ పాటను పూర్తిగా తానే రాయలేదని స్పష్టం చేశారు. దర్శకుడు ప్రేమ్ ముందుగా కన్నడలో రాసిన సాహిత్యాన్ని హిందీలోకి అనువదించమని తనను కోరారని తెలిపారు.
ఈ పాటలో కొన్ని పదాలు అసభ్యంగా ఉండటం వల్ల మొదట నేను రాయడానికి నిరాకరించాను. సెన్సార్ సమస్యలు రావచ్చని కూడా చెప్పాను. అయితే దర్శకుడు మరియు టీమ్ ఒరిజినల్ వెర్షన్ను అలాగే హిందీలోకి అనువదించమని ఒత్తిడి చేశారు. చివరికి నేను అదే చేశాను అని రఖీబ్ ఆలం వివరించారు. పాటలోని కొన్ని లైన్లు ద్వంద్వార్థాన్ని ఇస్తున్నాయని కూడా ఆయన అంగీకరించారు. పాటలో మద్యం సీసా గురించి వర్ణన ఉన్నప్పటికీ, మధ్యలో వాడిన కొన్ని పదాలు అసభ్యంగా అనిపించేలా ఉన్నాయి. మంచి పాటలు రాసినప్పుడు అంతగా గుర్తింపు రాకపోయినా, ఇలాంటి వివాదాల వల్లే ఎక్కువ ప్రచారం వస్తోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ వివాదం మరింత ముదరడంతో నిర్మాతలు కూడా స్పందించినట్లు సమాచారం. అధికారిక హిందీ వెర్షన్ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ పాటపై సోషల్ మీడియాలో చర్చలు, విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి, నోరా ఫతేహి నటించిన ఈ పాట ఇప్పుడు సంగీతం కంటే వివాదాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి మరింత స్పష్టత వస్తుందా లేదా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

