హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు మరోసారి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఆర్టీసీలో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉన్న ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్’ను రద్దు చేస్తూ మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే ఈ కఠిన నిర్ణయం తీసుకొన్నది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇక నుంచి ఈ ప్రయోజనాన్ని నిలిపివేస్తున్నట్టు సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ స్పష్టంచేశారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు భార్య లేదా భర్త ఎవరైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే.. వారి జీవిత భాగస్వాములకు ప్రోత్సాహకంగా సం స్థ అదనపు ఇంక్రిమెంట్‌ను పర్సనల్ పే రూ పంలో మంజూరు చేసేది. ఇద్దరు లేదా అంతకంటే తకువ పిల్లలున్నప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకుంటే ఈ ప్రయోజనం లభించేది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ పథకాన్ని పూ ర్తిగా రద్దుచేశారు. మార్చి 17 నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది.
ఉమ్మడి ఏపీలో 2001లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ను రద్దుచేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి ఏపీఎస్ఆర్టీసీలో మాత్రం ఈ పథకాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పథకా న్ని రద్దు చేద్దామని ఓ ఉన్నతాధికారి సూచించగా కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారు. కా ర్మికుల సంక్షేమంపై ఎలాంటి కోతలు ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చారు.
ఇన్సెంటివ్ రద్దు నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ సిబ్బందికి లభించే ఆర్థిక ప్రయోజనాల్లో కోత పడనున్నది. ఈ ఇన్సెంటివ్ ఏపీలో కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం ఏకపక్షంగా తీసేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, టీజీఎస్ఆర్టీసీగా ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను యాజమాన్యం రద్దు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మంగళవారం విడుదల చేసిన సర్యులర్‌ను తక్షణం రద్దు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిది. రద్దుచేసిన ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను పునరుద్ధరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌రెడ్డి డిమాండ్ చేశారు.