హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు తొలిసారిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లోని సీట్లు భర్తీచేయనున్నారు. అన్నింటికి కాకుండా 93 కేజీబీవీల్లోని సీట్లను మాత్రమే ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా భర్తీచేయనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. టీజీఆర్జేసీ సెట్ ద్వారా తెలంగాణ గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లోని ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 3న ప్రవేశ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాన్ని ఇంటర్‌బోర్డు పెంచింది. 25% పెంచారు. ఒక్కో పేపర్ మూల్యాంకనం చేసినందుకు రూ. 29.57 చొప్పున ఇస్తారు. క్యాంప్ ఆఫీసర్లు.. ఇతర అధికారులకు రోజుకు రూ.వెయ్యి చొప్పన పారితోషికం ఇస్తారు.