Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని జి చెన్నారంలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. జి. చెన్నారంలో పిటిషన్ ఇచ్చిన కనగల్ వెళ్తుండగా తన బైక్ అదుపుతప్పడంతో హెడ్ కానిస్టేబుల్ కింద పడిపోయాడు. దీంతో అక్కడిక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హెడ్ కానిస్టేబుల్ సైదులు గౌడ్ కనగల్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.